Gudivada Amarnath | సీటు పోవడంతో .. బోరున ఏడ్చిన అమర్‌నాథ్‌..

allroudadda

Gudivada Amarnath | 175 సీట్లే ఏపీలో ఉన్నాయన్నారు. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వగలరని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.వైసీపీలో గెలిచే వారికి సీట్లు..కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదన్నారు. గడిచిన కొన్ని రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారని.. అప్పటి నుంచి చర్చ మొదలైందని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండవద్దని స్పష్టంగా పార్టీ చెప్పిందన్నారు.

ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.అయితే తాజాగా అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అనకాపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. మంత్రి పదవిని చేపట్టారు. ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రెండో పెళ్ళైన.. రెండు నెలలకె తల్లి కాబోతున్న అమ్మడు..

allroudadda
allroudadda

పునర్జన్మ ఇచ్చిన అనకాపల్లి..

ఈ క్రమంలో నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరుపుతూ.. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల్ని మార్చుతున్నారు.ఈ క్రమంలో అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ ను నియమించారు. అమర్నాథ్ కు సంబంధించి వైసీపీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు.

ఈ చిన్న పని చేస్తే మీ ముఖం మెరిసిపోతుందన్న జాన్వీ!

సిట్టింగ్ స్థానమైన అనకాపల్లిని వీడిటంపై మంత్రి అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా తనకు పునర్జన్మ ఇచ్చిన అనకాపల్లి ప్రజల్ని వదిలి వెళ్లలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ కొత్త ఇన్ చార్జ్ మలసాల భరత్ ను పరిచయం చేస్తూ.. మంత్రి అమర్నాథ్ బోరున ఏడ్చారు.

Leave a Reply