Guntur Kaaram Review | గుంటూరు కారం మూవీ చూసి బాధలో ఉన్న మ‌హేష్‌బాబు..

allroudadda

Guntur Kaaram Review | దాదాపు ప‌ద‌మూడేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ మ‌హేష్‌బాబు- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదలైంది. చాలా కాలంగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చిన ‘గుంటూరు కారం’ పానిండియాగా మాత్రం విడుదల కాలేదు. 2022 లో ‘సర్కారువారి పాట’ తర్వాత మహేష్ బాబు నటించిన కొత్త సినిమా ఎలా వుంది? గుంటూరు కారం లాంటి పాత్రలో తను ఘాటుగా వున్నాడా, చప్పగా వున్నాడా, ఎలా వున్నాడు? ఇది తెలుసుకుందాం.

కథ :

రమణ (మహేష్ బాబు) చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన కారణంగా రమణ తల్లి వసుంధర (రమ్యకృష్ణ) అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. తల్లిగా దూరంగా పెరిగిన రమణ జీవితంలోకి మళ్ళీ పాతికేళ్ల తర్వాత తల్లి ప్రస్తావన వస్తోంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో రమణ మళ్ళీ తన తల్లిని చేరుకున్నాడా ?, లేదా ?, అసలు వసుంధర ఎందుకు తన కొడుకుని దూరం పెట్టింది ?, ఈ దూరానికి కారణం ఎవరు ?, రమణ తండ్రి సత్యం (జయరామ్) పాత్ర ఏమిటి ?, ఈ మధ్యలో ఆముక్తమాల్యద (శ్రీలీల) తో రమణ ప్రేమ కథ ఎలా సాగింది ?, ఫైనల్ గా రమణ తన తల్లికి దగ్గర అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

allroudadda
allroudadda

పనితీరు… Guntur Kaaram Review

త్రివిక్రమ్ దర్శకుడిగా ఆకట్టుకున్నా.. రచయితగా మాత్రం పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయారు. అయితే కథలో బలం లేకపోయినా, కామెడీ ఎలిమెంట్స్ తో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు తమన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాలో విజువల్ పరంగా వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపధ్య సంగీతం కూడా బాగుంది.

allroudadda
allroudadda

అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సినిమాలో కొన్నిచోట్ల స్లోగా సాగిన కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.

కాగా ఈ మూవీని చూసేందుకు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ కి వచ్చారు. అయితే థియేటర్ లో మహేష్ చాలా డల్ గా నిరాశలో కనిపించారు. మహేష్ మొహంలో ఎప్పుడు నవ్వు కనిపించేది. కానీ నేడు థియేటర్ లో మహేష్ డల్ గా ఉండడంతో.. అభిమానులు సైతం తమ బాధని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ని ఇలా చూడలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply