Jyothi Rai | గుప్పెడంత మనసు నటిలో ఇంత అందం ఉందా..

allroudadda

Jyothi Rai | ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న జగతి రియల్ లైఫ్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.జగతి అసలు పేరు జ్యోతి రాయ్.. జ్యోతి రాయ్ 1985 జూలై 4వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని మడిగిరిలో జన్మించింది. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే కర్ణాటకలోని పుతూర్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. జ్యోతి రాయ్ తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాక ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం జరిగింది.

ఇక జ్యోతి రాయ్ వ్యక్తిగత విషయానికొస్తే ఈమెకు వివాహం జరిగి ఒక బాబు కూడా జన్మించారు. ఇక ఈమె భర్త పేరు పద్మనాభ. కర్నాటకలోని బెంగళూరులో నెట్వర్క్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.జ్యోతి రాయ్ కుటుంబం విషయానికి వస్తే ఈమెకు ఒక సోదరి , సోదరుడు కూడా ఉన్నారు. జ్యోతి రాయ్ నటన మీద ఉన్న ఆసక్తి కారణంగా బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కన్నడలో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరును కూడా సంపాదించుకున్నారు.

allroudadda
allroudadda

జ్యోతి రాయ కన్నడ సీరియల్స్ లోనే కాదు కన్నడ సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా తన నటనతో వెండితెర ప్రేక్షకులను కూడా బాగా అలరించింది. ముఖ్యంగా ఈమెకు బుల్లి తెర మీదే కాదు వెండితెర మీద కూడా ఎంతోమంది అభిమానులు ఉండటం గమనార్హం.ఇక ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి క్యారెక్టర్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

మాల్దీవుల్లో తమన్నా లేటెస్ట్ పిక్స్ చూస్తే కళ్ళు చెదరాల్సిందే..

అది పక్కన పెడితే ఈ బ్యూటి రియల్ లైఫ్ లో ఎంతో మోడరన్‌గా అందాలు ఆరబోస్తూ కనిపిస్తుంది. అయితే సీరియల్ చూసి సంప్రదాయ బద్ధంగా ఉంటుందని ఫిక్సైన ఆడియ‌న్స్‌ ఈ పిక్స్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ఈ పిక్స్ లో ఎంతో హార్ట్ గా కుర్ర కారును ఆకట్టుకునే విధంగా ఉండే జ్యోతిరాయ్.. గుప్పెడంత మనసు కంటే ముందు నిరుపమ్ హీరోగా కన్యాదానం సీరియల్ లో నటించినది.

Recent Posts

Leave a Reply