allroudadda

Hanuman movie | హ‌నుమాన్ మూవీ పబ్లిక్ టాక్..! మాతెలుగు వాళ్ళని చూసి నేర్చుకోండి..

Hanuman movie | “హనుమాన్” ప్రీమియర్‌లు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్‌ను సాధిస్తున్నాయి. ఈ సినిమా బుకింగ్‌లు కూడా సంచలనాత్మకంగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా పెయిడ్ ప్రీమియర్‌ల కోసం BookMyShowలో గత 24 గంటల్లో దాదాపు 50,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇవి ఒక యువ హీరో నటించిన మీడియం-బడ్జెట్ చిత్రానికి అసాధారణమైన బుకింగ్స్ అని చెప్పవచ్చు.ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షో రూ. 2.5 కోట్లు వసూలు చేయడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

ఇటీవల ఉత్తరాదిలో కూడిన “కాంతార” మరియు “కార్తికేయ-2” భారీ బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. అటువంటి చిత్రాల విజయం తరువాత ప్రశాంత్ వర్మ యొక్క “హనుమాన్” సినిమా కోసం నిరీక్షణ పెరిగింది.తాజాగా తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ చిన్న చిత్రం భారీ లాభాలను సొంతం చేసుకోబోతోంది.

allroudadda
allroudadda

శుక్రవారమే విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు యావరేజ్ టాక్ రావడం హనుమాన్ కి మరింత కలసి రానుంది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు ఆంజనేయుడికి సినిమాకు చాలా విషయాలు కలసి వస్తున్నాయి. పండగల సమయం కావడం, పిల్లల్ని అలరించే భారతీయ సూపర్ మ్యాన్ కథ కావడం, తక్కువ ఖర్చులో మంచి గ్రాఫిక్స్ తో సినిమాను పూర్తి చేయడం ఆంజనేయుడు బలాన్ని మరింత పెంచుతున్నాయి.

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నా జూనియర్ మహేష్ ..

ఈ నెల 22వ తేదీ నాడు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కూడా ప్రశాంత్ వర్మ సినిమాకు మరింత లాభం చేకూర్చనుంది. దేశమంతా రామనామం జపం జరుగుతున్న వేళ హనుమంతుడి వెండి తెర విశ్వరూపాన్ని ఈ సినిమా ద్వారా దేశ ప్రజలు, లాభాల ద్వారా నిర్మాతలు చూడబోతున్నారు. రామనామం ఎక్కడుంటే నేనక్కడుంటాను అని హనుమంతుడు అంటాడు. మరో కొన్ని నెలల పాటు దేశమంతా రామనామం ఉంటుంది. అక్కడ రాముని భక్తుడు హనుమంతుడితో పాటు, హనుమాన్ చిత్రం ప్రస్తావన కూడా ఉంటుంది.

Leave a Reply