దేవుడా.. హ్యాపీ డేస్ టైసన్ ఇలా మారిపోయాడు ఏంటి?

హ్యాపీ డేస్ సినిమాలో శ్రావ్స్ అంటూ ఓ అమ్మాయి వెనక తిరుగుతూ ఉంటాడు కదా.. అతడే రాహుల్. ఆ సినిమాలో మాత్రం సీనియర్స్ ముద్దుగా టైసన్ అని ముద్దు పేరు పెడతారు. అప్పుడు కామెడీగానే పెట్టినా ఇప్పుడు నిజంగానే టైసన్ అయిపోయాడు. ఆ కుర్రాడే ఇప్పుడు ఈ కండల వీరుడు. అమ్మో ఇలా అయిపోయాడేంటి అని షాక్ అవుతున్నారా..? 2007లో హ్యాపీ డేస్ సినిమా విడుదలైంది. అప్పుడు మనోడి వయసు 21.

అందులో చాలా బక్కగా ఉన్నాడు. డిగ్రీ పట్టా చేత పట్టుకుని వచ్చి శేఖర్ కమ్ముల సినిమాలో నటించాడు. సినిమా ట్రెండ్ సెట్టర్ అయినా కూడా అందులో నటించిన వాళ్లలో నిఖిల్ తప్ప ఎవరూ సక్సెస్ కాలేదు. తమన్నా అప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరుణ్ సందేశ్ ఒకట్రెండు సినిమాలతోనే సర్దేసాడు. టైసన్ గా నటించిన రాహుల్.. స్నేహితులను మోసం చేసే వంశీ అయితే ఎక్కడున్నారో కూడా తెలియదు.

అడపాదడపా సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులకు మాత్రం హ్యాపీ డేస్ టైసన్‌గానే గుర్తున్నాడు రాహుల్.మధ్యలో రెయిన్ బో, వెంకటాపురం లాంటి సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ఎవరూ గుర్తు కూడా పట్టనంతగా మారిపోయాడు ఈయన. ఈ మధ్యే విడుదలైన రాహుల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన ఓ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించబోతున్నాడు. 1993 ముంబై బ్లాస్ట్‌ల్లో కీలక పాత్రధారిగా ఉన్న అజీజ్ రెడ్డి అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో రాహుల్ కనిపించనున్నాడు. ఈ గ్యాంగ్‌స్టర్ కథను సుమన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

Leave a Reply