మరో విషాదం.. దిగ్గజ నటుడు కన్నుమూత..!

సినీ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు హరీష్ పెంగన్(Harish Pengan) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచారు.చాలా కాలంగా కాలేయ స‌మ‌స్య‌తో ఇబ్బంది పడుతున్నారు హరీష్.

ఈ క్రమంలో రీసెంట్ గా హరీష్ కి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఈ నెల మొదటి వారం ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి అవసరం అని తెలిపారు. దాంతో ఎవరి కాలేయం సూట్ అవుతుందా అని చూడగా.. పెంగన్ సోదరి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది.

అయితే ఈ నటుడు పేదరికంలో ఉండటం వల్ల.. ఆపరేషన్ కు కావల్సిన 30 లక్షలు సమకూర్చలేకపోయారు. హరీష్ ప్రాణ స్నేహితులు నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తుండగానే పెంగన్ ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్టానం సంపాదించుకున్నారు హరీష్. నటుడి అంత్యక్రియలు ఈరోజు(31 మే) నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం తెలిపారు.

Leave a Reply