Jaggery Benefits | ప్రతిరోజూ ప‌ర‌గడుపున బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా

Jaggery Benefits | బెల్లం ఒక అద్భుతమైన సహజ స్వీటెనర్. దీనిని చక్కెరకు బదులుగా ఉపయోగించవచ్చు. బెల్లం తీపిగా ఉండటమే కాకుండా అనేక ప్రయోజనాలతో కూడిన ఆహారం కూడా. బెల్లంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఖనిజాలు, ఇనుము అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెల్లంను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. బెల్లం వల్ల జలుబు, గొంతునొప్పి, దగ్గు తదితర సమస్యలను నివారిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పొటాషియం, క్యాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం మొదలైన బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం…

నిజానికి ప‌ర‌గ‌డుపున బెల్లంను తీసుకుంటే మ‌రిన్ని అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.మ‌రి అవేంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం పూట నీర‌సంగా క‌నిపిస్తుంటారు.అయితే ప‌ర‌గ‌డుపున చిన్న బెల్లం ముక్క లేదా బెల్లం క‌లిపి వాట‌ర్‌ను తీసుకుంటే గ‌నుక‌ శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.దాంతో నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు దూర‌మై.ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తారు.అలాగే కీళ్ల నొప్పుల‌తో బాధ ప‌డే వారికి బెల్లం బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పాలి.

Roja Daughter | స్టార్ హీరో వారసుడితో రోజా కూతురు రొమాన్స్..?

అవును, ఉద‌యాన్నే ఒక గ్లాస్ వాట‌ర్‌లో బెల్లంతో పాటుగా దంచిన చిన్న అల్లం ముక్క వేసి మ‌రిగించి.ఆ త‌ర్వాత‌ ఫిల్ట‌ర్ చేసి తీసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే ఎముక‌లు, కండ‌రాలు బ‌ల ప‌డ‌తాయి.దాంతో కీళ్ల నొప్పులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.మ‌ల‌బ‌ద్ధ‌కం ఎంద‌రినో వేధించే స‌మ‌స్య ఇది.అయితే ప‌ర‌గ‌డుపున చిన్న బెల్లం ముక్క‌ను తీసుకుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డ‌టంతో పాటుగా మ‌ల‌బ‌ద్ధ‌కం, ఎసిడిటీ, గ్యాస్, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్యలు ప‌రార్ అవుతాయి.

Health-Benefits-Of-Jaggery
Health-Benefits-Of-Jaggery

ఉద‌యాన్నే బెల్లంను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు చురుగ్గా ప‌ని చేస్తుంది.మ‌తి మ‌రుపు త‌గ్గి.జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతుంది.అంతేకాదు, ప‌ర‌గ‌డుపున బెల్లం తింటే ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది.రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.చ‌ర్మం య‌వ్వ‌నంగా, గ్లోగా మారుతుంది.మ‌రియు శ్వాసకోశ స‌మ‌స్యలు నివార‌ణ అవుతాయి.అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విష‌యం ఏంటంటే.హెల్త్‌కు మేల‌ని బెల్లం అతిగా తీసుకోవ‌డం చేయ‌రాదు.మ‌రియు స్వ‌చ్ఛ‌మైన బెల్లాన్నే వాడాలి.

Recent Posts

Leave a Reply