Fermented Rice : వందల రోగాలని నయం చేసే చద్దన్నం ఒక పరమాద్భుతం!

Fermented Rice: “పెద్దల మాట చద్దన్నం మూట” సామెత అందరికి తెలిసిందే.. ఉదయానే చద్ది అన్నం తినడం ఇప్పటికీ పల్లెల్లో, పట్టణాల్లోనూ వుంది. చద్ది అన్నం ఓ సంప్రదాయ ఆహారం. చాలా మంది చద్ది అన్నం తింటే నిద్ర వస్తుందని, నీరసంగా ఉంటుందని అనుకుంటారు. చద్ది అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాము. చద్ది అన్నం ప్రయోజనకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. ఉదయాన్నే చద్ది అన్నం తింటే కడుపు సంబంధిత వ్యాధులు నయమవుతాయి..!!

రాత్రి మిగిలిన అన్నాన్ని ఒక మట్టి కుండ లో కానీ స్టీలు గిన్నెలో వేసి ఇ అందులో అన్న మునిగే వరకు నీళ్ళు పోయాలి తరువాత కాసిన్ని గోరువెచ్చని పాలు అందులో పోసి తోడు వేయడానికి అర స్పూన్ పెరుగు కలపాలి. ఇందులో అల్లం పచ్చిమిర్చి ఉప్పు పెద్ద ఉల్లి ముక్కలు వేసి కలపెట్టాలి. దీని పైన మూత పెట్టి ఉంచి రాత్రంతా అలాగే వదిలేయాలి. అలా రాత్రంతా అన్నం కలిసిపోయి చద్దన్నం గా మారుతుంది. ఉదయం ఆ అన్నాన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచిది.

చద్దన్నంతో లాభాలు..

చద్ది అన్నం లో పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్లు సాధారణ అన్నం తో పోలిస్తే పదిహేను రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ (Onion), పచ్చిమిర్చి (Green Mirchi), పెరుగు (Curd) కలుపుకుని తీసుకుంటే దేహంలో వేడిని (Body Heat) తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఎండాకాలంలో ఈ అన్నం తింటే డిహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. తక్షణ శక్తి ( Instant Energy) ని అందిస్తుంది. ముందు రోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అరుదుగా లభించే విటమిన్ బి6, బి12 తేలికగా పొందవచ్చు. ఇందు లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో కనీసం రెండు రోజులు తినేవారిలో రోగ నిరోధక శక్తి ( Immunity) ఎక్కువగా ఉంటుంది.

ఈ అన్నం ఎక్కువ సేపు మజ్జిగలో చేయడం వలన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఇందులో లభిస్తుంది. ఈ అన్నం ఎక్కువ సేపు మజ్జిగలో చేయడం వలన శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా ఇందులో లభిస్తుంది. ఇవి రక్షణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.

also Read : www.allroudadda.com

శరీరంలో ఉండే హానికర వైరస్లను హరింప చేస్తాయి. ఇది ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఈ అన్నం తినడం వలన పేగుల్లో వచ్చే అనేక సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం (Constipation) ను నివారిస్తుంది. నీరసం అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది. చూశారా రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలలో.. ఇప్పటినుంచి మీరు కూడా చద్దన్నం తినండి.

Leave a Reply