ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే కోటీశ్వరులు అవ్వడం ఖాయం..!

మీ ఇంట్లో ఆర్థిక సమస్యలా? అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి కష్టమైనా? మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెంటనే పోవాలంటే అద్భుతమైన రెమిడీ ఒకటి ఉంది. ఈ రెమిడీని భక్తిశ్రద్ధలతో చేశారంటే చాలు.. కొద్దిరోజుల్లోనే మంచి మార్పులను చూస్తారు. మీ కష్టాలన్నీ పోయి అన్ని సంతోషాలే మీ ఇంట్లో విరజిల్లుతాయి. మీరు చేయాల్సిందిల్లా.. తమలపాకుతో ఇంటి ముందు తోరణం కట్టుకోవడమే.. అదేలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

తమలపాకు చెట్టు ఇంట్లో ఉందా? అయితే, ఇలా తమలపాకుతో ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకు పూజ చేస్తూ ఉండండి. తమలపాకు చెట్టు ఇంట్లో ఉండడం వల్ల అనేక సిరిసంపదలు కలుగుతాయి. పూర్వరోజుల్లో అమృతం కోసం దానవులు, దేవతలు క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మి దేవితోపాటు తమలపాకులు కూడా పుట్టాయని పురాణాల్లో చెబుతారు.

తమలపాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు. గ్రహ దోషాలు, శత్రుపీడలు ఉండనే ఉండవు. ఆర్థిక సమస్యలు, భూత, పిశాచ సమస్యలు పోవాలంటే… రోజు ఒక తమలపాకు తీసుకొని శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతుని దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుని తినవచ్చు లేదా పారే నీటిలో వేయాలి. ఇలా చేస్తే.. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అంటారు. తమలపాకు ఇంట్లో తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర తూర్పు ఈశాన్యంలో పెంచుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

Leave a Reply