Akash Puri  | పూరీ జగన్నాథ్ కొడుకుతో హేమ కూతురు పెళ్లి..?

allroudadda

Akash Puri  |టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా కొన్ని వందలకు పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “హేమ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి హేమ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ కామెడీ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తో నటి హేమ కి మంచి సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు బహిరంగ ప్రదేశాల్లో కూడా నటి హేమ దర్శకుడు పూరి జగన్నాథ్ తో సన్నిహితంగా ఉంటూ సరదాగా మాట్లాడుతున్నా సందర్భాలు కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలుసు. అయితే గత కొద్ది కాలంగా నటి హేమ కూతురితో దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి పెళ్లి జరగబోతోందని పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

allroudadda
allroudadda

దీంతో తాజాగా ఈ విషయంపై నటి హేమ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఆకాష్ పూరి తో తన కూతురు పెళ్లి జరుగుతుందని వినిపిస్తున్న వార్తలపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో తనకి దర్శకుడు పూరి జగన్నాథ్ స్నేహం ఏర్పడిందని అంతేగాక పూరి జగన్నాథ్ తనని సోదరిలా చూసుకుంటాడని దాంతో ఇప్పటికీ తాము మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపింది.

Money  | మీకు ఆకస్మికంగా కలలో డబ్బులు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా?

అలాగే తమ ఇద్దరి ఇళ్లు కూడా ఒకేచోట ఉండటంతో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి మరియు తన కూతురు ఈషా ఇద్దరు కలిసిమెలసి పెరిగారని వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉందని చెప్పుకొచ్చింది.ఇక వీరిద్దరి పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం తమకు అలాంటి ఉద్దేశం లేదని ఒకవేళ భవిష్యత్తులో తన కూతురు ఈషా మరియు ఆకాష్ పూరి కి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగితే కచ్చితంగా తమ పిల్లల అభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. ఇక తన కూతురు ఈష ప్రస్తుతం చదువుల్లో బాగా రాణిస్తోందని దాంతో మరింతగా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. దీంతో హేమ కూతురుతో ఆకాష్ పూరి పెళ్లి జరిగబోతున్నట్లు వినిపిస్తున్న వార్తలకి కొంతమేర పులిస్టాప్ పడింది.

Leave a Reply