Hero Nikhil | టీడీపీలో చేరిన టాలీవుడ్ హీరో నిఖిల్.. కానీ

allroudadda

Hero Nikhil | ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయాల్లో సినీజనాల సందడి అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ఆయా రాజకీయాలకు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యంగ్ హీరో నిఖిల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సందిగ్దతతో కూడిన చర్చనీయాంశం అయ్యింది.

ఎందుకంటే హీరో నిఖిల్ సిద్దార్థ్ టీడీపీలో చేరారు. నారా లోకేష్ ని కలసి ఆయనకు పూలకుండీ ఇచ్చి, పచ్చ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చు, ఎవరికైనా జై కొట్టొచ్చు. కానీ హీరో నిఖిల్ చేరిక సందర్భంగా టీడీపీ అఫిషియల్ ఖాతానుంచి వేసిన ట్వీట్ మరీ దారుణంగా ఉంది. హీరో నిఖిల్ సిద్దార్థ్ యాదవ్ టీడీపీలో చేరారంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

allroudadda
allroudadda

అసలిక్కడ హీరో నిఖిల్ కులాన్ని ప్రస్తావించడం దేనికి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకించి హీరో నిఖిల్ యాదవ కులానికి చెందిన వ్యక్తి అని అందరికీ అర్థమయ్యేలా టీడీపీ ట్వీట్ చేసింది. అంటే సదరు హీరో కులానికి చెందిన వారిని ఆకట్టుకోడానికి చేసిన ప్రయత్నమే ఇది అనుకోవాలి. అయితే ఈ ప్రయత్నం దారుణంగా బెడిసికొట్టింది. అంతా బాగానే ఉంది కానీ, కులప్రస్తావన ఎందుకయ్యా అంటూ నిలదీస్తున్నారు చాలామంది. అందులో టీడీపీ అభిమానులు కూడా ఉండటం విశేషం.

Recent Posts

Leave a Reply