Hero Suman | ఈసారి ఆంధ్రలో ఆ పార్టీదే విజయం మాత్రం పక్క.. నటుడు సుమన్

allroudadda

Hero Suman | హీరో సుమన్ నటుడిగా 45 ఏళ్లను పూర్తిచేసుకున్నారు. సుదీర్ఘమైన ఈ కెరియర్లో ఆయన ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “నాకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. నా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లెవరికీ సినిమాలతో ఎలాంటి సంబంధం లేదు. నటుడిగా నాకు ఎలాంటి అనుభవమూ లేదు” అన్నారు. “కాలేజ్ చదువు అయిపోయిన తరువాత ఏదైనా ఉద్యోగం చేయాలనీ అనుకున్నాను.

అంతే తప్ప సినిమాల్లో నటించాలనే ఆలోచన అప్పటికి లేనే లేదు. అలాంటి నేను సినిమాల్లోకి రావడం .. ఎదగడం .. నా వరకూ నేను చాలానే సాధించానని అనుకుంటున్నాను. సూపర్ హీరోననే భావిస్తున్నాను” అని చెప్పారు. అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో సీట్ల సర్దుబాబు సక్రమంగా జరిగితే తెలుగు దేశం పార్టీ, జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీనటుడు సుమన్ అన్నారు.

allroudadda
allroudadda

తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన తనకు రాజకీయ గురువని నటుడు సుమన్ చెప్పారు.సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ-జనసేన గెలుపు ఖాయం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఆలోచించి ఓటేయాలి కోరారు.

 వెంకటేష్ హీరోగా కానీ సురేష్ బాబు ప్రొడ్యూసర్గా ఎందుకు స్థిరపడ్డారో తెలుసా.

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఇప్పుడు నాకు లేదు అని స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో బాపట్ల ఎంపీగా చంద్రబాబు పోటిచేయమన్నారని…. అందుకు తాను చంద్రబాబుకు ధన్యావాదాలు చెబుతున్నానన్నారు.తమిళనాడులో హీరో విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా’ అని పేర్కొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent Posts

Leave a Reply