ఫ్యాన్స్‌కి భారీ సహాయం చేసిన సూర్య..! ఒక్కొక్కరికి ఎంత ఇచ్చాడో తెలుసా.

చాలా రోజుల త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కోసం చిన్న పాట య‌జ్ఞ‌మే చేశారు హీరో సూర్య‌. ఆయ‌న న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ స‌క్సెస్ జోష్‌లో వున్న ఆయ‌న రెట్టించిన విశ్వాసంతో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో పాండిరాజ్ తెర‌కెక్కిస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.ఇటీవ‌లే ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మం చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ఇటీవ‌ల కోవిడ్ ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో హీరో సూర్య ఈ మూవీ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కాలేక‌పోయారు.ఐతే రోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్న 250 మంది ఫ్యాన్ క్లబ్ సభ్యులకు/ అభిమానులకు సూర్య తాజాగా ఆర్థిక సహాయం చేసి అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఐతే ఆయన 250 మంది ఫ్యాన్ క్లబ్ సభ్యులలో ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున నగదు సాయం చేశారు. ఆయన 12.50 లక్షల రూపాయలను తన బ్యాంకు ఖాతా నుంచి నేరుగా అభిమానుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. కరోనా సంక్షోభంలో రూపాయి కూడా సంపాదించలేక నానా అవస్థలు పడుతున్న సమయంలో సూర్య నుంచి ఐదువేల సహాయం అందటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కష్టకాలంలో తమను ఆదుకున్న తమ ఫేవరెట్ హీరో కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

నిజానికి సూర్య అవసరంలో ఉన్న ప్రజలకు సాయం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను పై చదువులు చదివించడానికి ఆయన తన ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తుంటారు. స్కాలర్ షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆయన చేస్తున్న సహాయం వల్ల ప్రస్తుతం ఎందరో విద్యార్థులు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అనగా మే నెలలో ఆయన, తన సోదరుడు కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ కి కోటి రూపాయల విరాళం ఇచ్చి తమ దయా హృదయాన్ని చాటుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సూర్య పాండిరాజ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అతని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 35 శాతం షూటింగ్ పూర్తయిందని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ చిత్రంలో కూడా ఆయన ఒక పాత్రలో నటిస్తున్నారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సూర్య.. వెట్రిమారాన్ డైరెక్షన్ లో “వాడి వాసల్” అనే ఓ చిత్రంలో కూడా నటించనున్నారు.