Vadde Naveen | హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

allroudadda

Vadde Naveen | అప్పట్లో వరుసగా ప్రేమకథా చిత్రాలు చేస్తూ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వడ్డే నవీన్. అటు తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయ్యాడు. 1997లో ముప్పలనేని శివ డైరెక్షన్లో వచ్చిన ‘కోరుకున్న ప్రియుడు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు వడ్డె నవీన్. మొదటి చిత్రం పర్వాలేదు అనిపించడంతో … కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘పెళ్లి’ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

దాంతో హీరోగా ఇతనికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇతను సీనియర్ నిర్మాత వడ్డె రమేష్ కొడుకు. అంతేకాదు ఇతను నందమూరి కుటుంబానికి అల్లుడవుతాడు అన్న సంగతి చాలా మందికి తెలీదు.స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు కుమారుడు రామ‌కృష్ణ కూతురు అయిన చాముండేశ్వ‌రిని వ‌డ్డే న‌వీన్ పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల రిత్యా వ‌డ్డే న‌వీన్, చాముండేశ్వ‌రి విడిపోయారు.

allroudadda
allroudadda

అయితే వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల వ‌ల్లే న‌వీన్ కెరీర్ విష‌యంలో ఇబ్బందులు ప‌డ్డాడ‌ని ప‌లువురు సినీ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇక ఆ త‌రువాత వాత న‌వీన్ మ‌రొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్ర‌స్తుతం చాలా సంతోషంగా జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాల నుంచి సినిమాల‌కు దూరంగా ఉన్న న‌వీన్ చివ‌రగా నాలుగేళ్ల కింద‌ట‌ మ‌నోజ్ హీరోగా న‌టించిన ఎటాక్ సినిమాల్లో క‌నిపించారు వ‌డ్డే న‌వీన్‌. అస‌లు వ‌డ్డే న‌వీన్ సినిమాల్లో ఎందుకు న‌టించ‌డం లేద‌ని, ఉన్నట్టుండి సినిమాల‌కు దూరంగా ఎందుకు ఉన్నాడ‌ని ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం విశేషం.

Recent Posts

Leave a Reply