హీరో వెంకటేష్ గారి ఇంట తీవ్ర విషాదం ..!

ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వెంకటేశ్, సురేశ్ బాబుల బాబాయ్, దివంగత రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు మరణించారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

మంగళవారం ఆయన బాపట్లలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సురేశ్ బాబు కారెంచేడుకు వెళ్లి నివాళులర్పించారు. వెంకటేశ్ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉండటంతో రాలేనట్లు తెలుస్తోంది.

రేపు ఉదయం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా దగ్గుబాటి మోహన్ బాబు మ్రుతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం నివాళులర్పించారు.

Leave a Reply