Arundhati Nair | ఐసీయూలో చికిత్స పొందుతూ సాయం కోరుతున్న హీరోయిన్..

allroudadda

Arundhati Nair | ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రోడ్డు ప్రమాదాల గాయపడటం, కన్నుమూయడం జరుగుతుంది. వారం రోజుల క్రితం కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

ఓ ఇంటర్వ్యూకి హాజరై తిరిగి ఇంటికి స్కూటీపై వెళ్తున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో అరుంధతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని వార్తలు వస్తున్నాయి.

allroudadda
allroudadda

వివరాల్లోకి వెళితే..మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు చేర్చారు. ఆమెకు మెడ ఎముక, పక్కటెముకలు విరిగిపోయాయి. తలలో రక్తం గడ్డ కట్టింది. వెంటిలేటర్‌పై ఆమె ఉంది. ఆసుపత్రి ఖర్చులు అధికంగా ఉన్నాయని, దాతలు ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Reply