Heroine Laya: హీరోయిన్‌ లయ అప్పట్లో స్టార్ హీరోయిన్‌.. కానీ ఇప్పుడు అమెరికాలో ఏం జాబ్ చేస్తుందో తెలుసా?

టాలీవుడ్ లో అందాల ఆరబోతతోనే నెట్టుకొస్తున్న కొంతమంది హీరోయిన్స్ కి చుక్కలు చూపించిన హీరోయిన్ లయ. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమై తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి, ఒకే ఏడాది లో పది సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.

కెరీర్ అంత పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లో ఆమె గణేష్ గోత్రి అనే అతనిని పెళ్ళాడి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఆమె మళ్ళీ మీడియా కి కూడా కనపడలేదు.ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకి వచ్చి పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

లయ భర్త గణేష్ పెద్ద పారిశ్రామిక వేత్త అని, అతనికి ఉన్న ఆస్తులు వేల కోట్ల రూపాయిల్లోనే ఉంటుందని, ఇలా యూట్యూబ్ మరియు సోషల్ మీడియా లో పలు కథనాలు ప్రచారం అయ్యాయి. తాజాగా తాను పనిచేస్తున్న కంపెనీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇటీవలే హైదరాబాద్‌ నుంచి అమెరికా తిరిగి వెళ్లిన లయ సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉంటూ సందడి చేస్తున్నారు. వెండితెరకు దూరమైన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. లయ ప్రస్తుతం అమెరికాలోని జోబి ఏవియేషన్‌ ఏరో స్పేస్ కంపెనీలో ఐటీ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో తెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్.. ఇప్పుడు జాబ్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

Leave a Reply