Heroines : టాలీవుడ్ లో ఎలాంటి గాసిప్స్ లేని టాప్ స్టార్ హీరోయిన్స్ ఎవరో తెలుసా..!

బ్లాక్‌ వైట్‌ రోజుల్లో హీరోయిన్‌ అంటే చీరల్లోనే కనిపించేవారు. కానీ రాను రాను ట్రెండ్ మారింది. హీరోయిన్‌ లు సినిమాకు గ్లామర్‌ యాడ్ చేస్తున్నారు. హాట్ డ్రెస్‌ లతో సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్స్‌ ను యాడ్ చేస్తున్నారు. 90ల నుంచి హీరోయిన్ అంటే సినిమాకు కేవలం గ్లామర్‌ మాత్రమే అన్నట్టుగా సాగింది.

తరువాత కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినా మేజర్‌ గా హీరోయిన్‌ అంటే కేవలం గ్లామర్‌ ఎలిమెంట్‌ గానే చూస్తున్నారు మేకర్స్‌.ఐతే సోష‌ల్ మీడియా గురించి అయితే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.కానీ కొంద‌రు హీరోయిన్స్ విష‌యంలో గాసిన్స్ అనే మాటే లేదు.సినిమా ప్ర‌యాణంలోనూ, వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఏ ఊహాగానాలూ లేవు.ఇంతకీ ఆ టాలీవుడ్ బ్యూటీలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం!

ఊహ:శ్రీ‌కాంత్ తో జంట‌గా ప‌లు సినిమాల్లో న‌టించిన ఈమె.అత‌డినే ప్రేమించి పెళ్లి చేసుకుంది.చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రాల్లో చేసిన ఆమె.ఏనాడూ గాసిప్ వార్త‌ల‌కు చాన్స్ ఇవ్వ‌లేదు.

సుజాత:ఇద్ద‌రు పిల్ల‌లు అయ్యాక సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.చ‌క్క‌టి డీసెంట్ పాత్ర‌లు చేసింది.ప‌రిదిలో ఉంటూ మంచి నటిగా కొన‌సాగారు.త‌ను చ‌నిపోయే వ‌ర‌కు ఏ నెగెటివ్ వార్త కూడా ఆమెను ప‌ల‌క‌రించ లేదు.

భూమిక:ఈమె చాలా సినిమాలు చేసినా.ఎక్క‌డా హ‌ద్దులు దాటి ప్ర‌వ‌ర్తించ‌లేదు.చ‌క్క‌టి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచారు.మంచి సినిమాలు చేసి.వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది.

నమ్రతా:ముందుగా మోడ‌ల్ గా చేసిన ఈమె.అంజి సినిమాతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీల‌లోకి వ‌చ్చింది.మ‌హేష్ బాబుతో ప్రేమ‌లో ప‌డింది‌.అనంత‌రం వివాహం చేసుకుంది.అనంత‌రం చ‌క్క‌టి జీవితాన్ని గ‌డుపుతున్నారు.

లయ:ఈ అచ్చ‌తెలుగు అమ్మాయి మీద కూడా ఏ మ‌చ్చా లేదు.చ‌క్క‌టి కుటుంబ క‌థ చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఆమె.సాయి కిర‌ణ్ తో ప్రేమ‌లో ప‌డింది.కొన్ని కుటుంబ కార‌ణాల వ‌ల్ల వీరి పెళ్లి కాలేదు.అనంత‌రం ఓ ఎన్నారైని వివాహం చేసుకుని అమెరికాలో స్థిర‌ప‌డింది.

Leave a Reply