టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలతో సమానంగా హీరోయిన్లకు పారితోషకం ఇవ్వరు అని అందరికీ తెలిసిందే . కానీ ఇటీవల హీరోయిన్లు కూడా పారితోషికం విషయంలో డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఎవరు అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సౌత్లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ ల రెమ్యునరేషన్ లు ఏ విధంగా ఉన్నాయి అంటే..

సమంత:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తెలుగు , తమిళ్, హిందీ భాష సినిమాలలో నటిస్తోంది ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోంది.

నయనతార:
వరుసగా.. సీనియర్ హీరోలతో జోడి కడుతున్న ఈ ముద్దుగుమ్మ రేమ్యునరేషన్ విషయంలో అసలు రాజీ పడడం లేదు. ప్రస్తుతం వివాహం తరువాత రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది.

కీర్తి సురేష్:
అనుకున్న సమయంలోనే స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేసింది. అయితే ఇప్పటివరకు రెండు కోట్లు తీసుకున్న కీర్తిసురేష్ ఇప్పుడు రూ.4కోట్లు డిమాండ్ చేస్తోంది.

రష్మిక:
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా బాలీవుడ్లో సైతం సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు రూ.3 నుండి రూ.5 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తోంది.

త్రిష.. ఇప్పుడు సౌత్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది. ఈ లియో సినిమా కోసం త్రిష అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.10 కోట్లు.
చివరిసారి పొన్నియిన్ సెల్వన్ 2లో కనిపించిన త్రిష.. ఈ మూవీ రెండు పార్ట్ లూ హిట్ అయిన తర్వాత తన రెమ్యునరేషన్ పెంచేసింది.

Leave a Reply