అమ్మో.. నయన్‌ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే మీకు నిద్ర కూడా పట్టదు..!

20 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న సౌత్ స్టార్ నయనతార తన అద్భుతమైన నటనా ప్రతిభతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా, రేప్ సర్వైవర్ స్టోరీలో నటి అయినా నయనతార ప్రతి పాత్రకు ప్రాణం పోస్తుంది.నయనతార తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనిక నటీమణులలో ఒకరైన నయనతార నికర ఆస్తుల విలువ, జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా..?నిజానికి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా ఇలా ఒక్కటేమిటీ అన్ని భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇక ఇప్పుడు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ అరంగేట్రం సైతం చేయనుంది.షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయన్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇటీవలే ప్రియుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్‏ను వివాహం చేసుకున్న నయన్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం నయన్ ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఆమె ఆస్తి విలువ దాదాపు రూ. 165 కోట్లు ఉందట. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.ఇందుకుగానూ ఒక్కో సంస్థ నుంచి రూ. 5 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.

అలాగే ఆమెకు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో అధునాతర వసతులతో కూడిన నాలుగు ప్లాట్లు, కేరళలోని తన తల్లిదండ్రులు నిర్వహిస్తున్న ఇల్లు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సొంత ఇళ్లను ఏర్పాటు చేసుకుందట. హైదరాబాద్ లోని ఒక్కో ప్లాట్ సుమారు రూ. 15 కోట్లు విలువ చేస్తుందట.అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా ఒక జెట్ విమానం కూడా ఉందని సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా నయన్ సినిమాల కంటే బిజినెస్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply