Varun tej : అత్తగారింటికి లావణ్య త్రిపాఠీ ఎంత కట్నం తీసుకొస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనంగా మారింది. వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాటి(Lavanya Tripati) ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చిన వరుణ్ తేజ్(Varun tej) ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు అయితే తాజాగా వీరిద్దరి గురించి మరొక వార్త వైరల్ అవుతుంది.వీరిద్దరికీ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరగబోతుందని ఇప్పటికే నిశ్చితార్థానికి సంబంధించి పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానం కూడా అందిందని సమాచారం. ఇక మెగా ఫ్యామిలీ ఈ నిశ్చితార్థ వేడుక ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ విషయాలన్నీ పక్కన పెడితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి అన్ని కోట్ల కట్నం తేబోతుందా అంటూ ఓ వార్త నెట్ లో వైరల్ గా మారింది.మరి ఇంతకీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) ఎంత కట్నం తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక లావణ్య త్రిపాఠిని మెగా ఫ్యామిలీకి కోడలిగా అడుగుపెడుతూ కట్న కానుకలు భారీగానే తెస్తున్నట్లు తెలుస్తుంది.

వరుణ్ తేజ్ లావణ్య కి ఒక లగ్జరీ కారు అలాగే వీళ్లు ఉండడానికి ఒక లగ్జరీభవనం, అంతేకాకుండా లావణ్య త్రిపాటికి దాదాపు 5 కిలోల బంగారం. అంతేకాకుండా ఆరు కోట్ల డబ్బు కట్నంగా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వరుణ్ తేజ్ (Varun tej) మాత్రం కట్నం వద్దు ఏమి వద్దు అని చెప్పినప్పటికీ లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు మాత్రం మా సంతృప్తి కోసం ఇస్తున్నాం అంటూ చెప్పారట. దీంతో చేసేదేమీ లేక వరుణ్ తేజ్ కూడా ఆ కట్నం తీసుకోవడానిక రెడీ అయ్యారట.

Leave a Reply