Ileana D’Cruz : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా..! ఫొటోలు వైరల్.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల జాబితాలో ఒకరిగా ఉండి గత కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇలియానా డిక్రూజ్. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉండే ఈ భామ తాజాగా ఇప్పుడు ఒక షాకింగ్ ప్రకటన చేసి అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది. తాజాగా ఇలియానా సోషల్ మీడియా లో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మంగళవారం ఉదయం ఇలియానా తన జీవితం లోకి ఒక పసికందును స్వాగతించి షాక్ ఇచ్చింది.

అయితే దీనిపై పలువురు పెళ్లి కాకుండానే తల్లి ఎలా అయ్యావు? ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అంటూ బోలెడు ప్రశ్నలను నెటిజన్లు అడుగుతున్నారు. మరికొందరు మాత్రం అవి ఇలియానా పర్సనల్‌ విషయాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికి ఇలా ఇలాయానా ఒక్కసారిగా ప్రెగ్నెంట్‌ అంటూ చెప్పడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.ఇక ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌ కొనసాగింది. కాగా కొన్నాళ్ల డేటింగ్‌ తర్వాత అతడితో బ్రేకప్‌ చెప్పేసింది.

ఆ తర్వాత కత్రినాకైఫ్‌ సోదరుడు స్టెబాస్టిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు జరిగింది. దాన్ని నిజం చేస్తూ ఎన్నో సార్లు ఈ జంట మీడియా కంట పడింది. మరీ ఆ బిడ్డ వీళ్లద్దరికి పుట్టబోయే బిడ్డేనా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమాల విషయనికొస్తే ప్రస్తుతం ఈ గోవా సోగసరి ‘అన్‌ఫేర్‌ అండ్‌ లవ్‌లీ’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Leave a Reply