నాకు 40… త‌న‌కు 20.! వైరల్ అవుతున్న స్టోరి!

తను నా భార్య ప్ర‌స్తుతం నాకు 40 ఏళ్లు, త‌న‌కు 20. అయితేనేం? ఈ ఏజ్ గ్యాప్ మాకెప్పుడూ ఇబ్బందిగా అనిపించ‌లేదు. నాకంటే 20 ఏళ్ల చిన్న‌దైనా త‌న మెచ్యురిటీ లెవ‌ల్స్ చూస్తే భ‌లే ముచ్చ‌టేస్తుంది నాకు. న‌న్ను ఈ స‌మాజం ఎక్క‌డ త‌ప్పుప‌డుతుందోన‌ని తాను ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిలా త‌యార‌వుతుంది.

త‌న‌కు ఇబ్బంది క‌ల‌గొద్ద‌ని నేను వ్యాయామాలు, డైట్ గ్ర‌టా చేస్తూ వ‌యసు త‌క్కువ‌గా క‌న‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తాను.నేను చికెన్, మటన్ తినను. తనకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ తను నా కోసం తను వెజిటేరియన్ గా మారిపోయింది. వద్దని చెప్పిన వినలేదు.తను మోడ్రన్ డ్రెస్సెస్ లో చాలా బాగుంటుంది.

కానీ మా మధ్య ఉన్న వయసును కవర్ చేయడానికి చీరలు కట్టుకుంటుంది. నాకు కథలు చదవడం ఇష్టం. తనకు ఆ కథలు వినడం ఇష్టం. అందుకే ప్రతిరోజు నేను చదివే కథలు తను వింటుంటుంది. నేను జిమ్ చేస్తుంటే, తను ఎంకరేజ్ చేస్తుంటుంది. ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే, వయసు అనేది ఓ నెంబర్ మాత్రమే. ప్రేమ శాశ్వతం. అందుకే 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ మాకు సమస్య కాలేదు. కాదు కూడాను!

Leave a Reply