అమ్మో.. ఇంద్రజ డాన్స్ మామూలుగా లేదుగా! వీడియొ…

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ.కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఈమె దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబంలో ఈమె జన్మించింది.ఇంద్రజ ఓ సింగర్ కూడా అన్న విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ఈమె అసలు రజతి అని కూడా ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు.చిన్ని చిన్ని ఆశ’ ‘ సొగసు చూడతరమా’ ‘యమలీల’ ‘పెద్దన్నయ్య’ ‘ఒక చిన్నమాట’ వంటి సినిమాల్లో ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. తాజాగా ఈమె తన లవ్ మ్యారేజ్ గురించి తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రూ.7500 తో ఇంద్రజ పెళ్లి జరిగిందట. 13 మంది పెళ్లి పెద్దలు వచ్చినట్టు ఆమె తెలియజేసింది.ఇంద్రజ భర్త పేరు.. మహ్మద్ అబ్సర్.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి వరకు దారి తీసింది.

ఇంద్రజ భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే.ఐతే తాజాగా ఇంద్రజ ప్రియమైన నీకు సినిమాలో మనసున ఉన్నది అనే పాటకు పర్ఫామెన్స్ చేశారు.అనంతరం గజిని సినిమాలో రహతుల రహతుల అనే పాటకు మా స్టెప్పులు వేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ చేశారని చెప్పాలి.ఇలా ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply