IPL2023| ఐపీఎల్‌-16 టైటిల్ విజేత‌గా చెన్నై.. కెప్టెన్ కి రారాజు ధోని మాత్రమే..!

‘ధోనిది మాస్టర్ మైండ్. ఫామ్ లేకుండా ఇబ్బందిపడుతున్నఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో ధోనికి బాగా తెలుసు. యంగ్ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపి వారి నుంచి ఉత్తమ ఆటను బయటకు తీస్తాడు. అంతేకాకుండా టీంను బలంగా తయారు చేయడంలో ధోని స్పెషలిస్ట్.ఐతే చెన్నై సూప‌ర్ కింగ్స్ మరోసారి అద‌ర‌గొట్టింది.ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.

ఈ క్ర‌మంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక టైటిళ్లు అందుకున్న‌ ముంబై ఇండియ‌న్స్ రికార్డును స‌మం చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో చెన్నై 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.ఐపీఎల్ చ‌రిత్ర‌లో 250 మ్యాచులు ఆడిన ఏకైక ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌డం ద్వారా ధోని ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఆట‌గాడు కూడా ఐపీఎల్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఆడ‌లేదు. ధోని ఐపీఎల్‌లో 39.09 సగటుతో 135.96 స్ట్రైక్ రేట్‌తో 5,082 పరుగులు చేశాడు. ఇందులో 24 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 84*. 239 సిక్స‌ర్లు, 329 ఫోర్లు బాదాడు. కీప‌ర్‌గా 141 ఔట్ల‌లో భాగ‌స్వామ్యం అయ్యాడు.ఐపీఎల్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో ధోని త‌రువాత ముంబైఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఉన్నాడు.

Leave a Reply