రంగస్థలం మహేష్ గురించి తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!

జబర్దస్త్ కామెడీ షో తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని అక్కడ తన ప్రతిభతో అందరిని అలరించి ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటున్న వారిలో మహేష్ అచంట కూడా ఒకరు. తనదైన యాస,డైలాగ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఆయన.. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టాడు. ఇక మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది.

ఇక అప్పటినుంచి ఆయనను అందరూ రంగస్థలం మహేష్ అంటూ పిలవడం మొదలుపెట్టారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో జరిగిన కష్టాలను ,చేదు అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఇకపోతే విరూపాక్షా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. మహేష్ అచంట మాట్లాడుతూ.. డిగ్రీ అయిపోగానే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను..

కానీ అవకాశాలు లభించలేదు.. అదే సమయంలో కోకో కోలా కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ సినిమాల కోసం ప్రయత్నించాను. ఉద్యోగం సరిగా చేయలేదని వెళ్లిపోమనడంతో ఇక సినిమాల మీదే ఆధారపడ్డాను.అయితే సినిమా అవకాశాలు ఇంకా రాకముందే నాన్న మరణ వార్త నన్ను మరింత ఒంటరిని చేసింది.ఆ సమయంలో నాన్న శవాన్ని కాల్చడానికి కూడా డబ్బులు లేవు. ఇంకెందుకు జీవితం అనిపించింది..

ఇది చూసిన చాలామంది నీది ఒక బతుకేనా అంటూ అవమానించారు. ఇక కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు కూడా నీకు సినిమాలు అవసరమా అంటూ హేళన చేశారు.. అంటూ ఎమోషనల్ అయ్యాడు మహేష్. ఇక తండ్రి మరణించాక చాలామంది దగ్గర అవమానాలు పడ్డారట. అలా చాలా దగ్గర వాళ్లే సినిమాలు అంటూ తిరగకుండా ఏదైనా ఉద్యోగం చూసుకోమని క్లాస్ కూడా పీకారు అంటూ అతను అనుభవాలను పంచుకున్నారు మహేష్.

Leave a Reply