apparao: బ్రతికి ఉండగానే చంపొద్దు.. డబ్బుకోసం ఇంత దిగజారాలా? అప్పారావు

అప్పారావు అనే పేరు వింటే ఏ అప్పారావు? అనే ఎవరైనా అడుగుతారు. అదే ‘ జబర్దస్త్’ అప్పారావు అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆయన జనంలోకి వెళ్లిపోయారు. ఆయనను చూడగానే గుండు హనుమంతరావు గుర్తుకు వస్తారు.

ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు .. ఈ కామెడీ షో వలన ఆయనకు వచ్చింది. అలాంటి పాప్యులర్ షో లో ఈ మధ్య కాలంలో ఆయన కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. మనిషి బతికుండగానే చనిపోయినట్లు వార్తలు రాశారు. అయితే మనిషి బతికుండగానే మరణించాడని చెప్పే అధికారం, హక్కు మీకుఎవరు ఇచ్చారు.

ఎవరైన చనిపోవాల్సిందే. అలానే ఇలాంటి అసత్య వార్తలు రాసే వారు కూడ చనిపోవాల్సిందే. అయితే బతికుండగానే చంపేసి..మానసికంగా వేదనకు గురిచేస్తున్నారు. ఇక లింక్ ఓపెన్ చేస్తే దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. లేనిపోని వార్తలు రాసి మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయండి.

అందరి తరపున కోరుకుంటున్నాను.. వాస్తవాలు మాత్రమే రాయండి. బతికే ఉన్న మనిషిని చనిపోయినట్లు రాయకండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్ వాళ్లందరూ ఈ మాటలు వినాలి. ఎందుకంటే.. తాను ఒక నాటిక రాద్దామనుకున్నానని, దాని పేరు యూట్యూబ్ నీకోక దండం అని అప్పారావు అన్నారు. ప్రస్తుతం అప్పారావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply