Jabardasth Fiama | సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా.. జబర్దస్త్ ఫైమా

allroudadda

Jabardasth Fiama | జబ‌ర్ధ‌స్త్ ఫైమా అంటే గుర్తు పట్టని వారుండరేమో. ‘పటాస్’ కామెడీ షోకి ఆడియెన్‌గా వెళ్లి అక్కడ కంటెస్టెంట్ గా అవకాశం అందుకొని.. తన పర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ తరువాత జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ తనదైన డైలాగ్ డెలివరీతో పంచ్‌లు వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీని అందుకుంది. ఇక అక్కడి నుంచి బిగ్‌బాస్‌కి వెళ్ళింది. గత సీజన్ లో కంటెస్టెంట్ గా బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా..

దాదాపు 10 వారాల హౌస్ లో కొనసాగింది. ఇక బిగ్‌బాస్‌ ద్వారా మరింత ఫేమ్ ని సంపాదించుకుంది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఫైమా.. ఇటీవల సొంతంగా ఇల్లు కట్టుకొని తన కోరిక‌ను నెర‌వేర్చుకుంది.తాజాగా ఫైమా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

భయపెడుతున్న కరోనా.. ఏపీలో తొలి మరణం

allroudadda
allroudadda

హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నటిస్తా..

Jabardasth Fiama | ఈ క్రమంలో ఆమెకు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తే.. ఇంకా ప్లాన్ చేయలేదు. ఆ టైంకి చూడాలి అని చెప్పింది. అలాగే ఆఫర్స్ గురించి కూడా మాట్లాడింది.సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు.. ఇంతవరకు ఆఫర్ రాలేదు. కానీ ఛాన్స్ వస్తే తప్పకుండా హీరోయిన్ గా నటిస్తాను అని చెప్పుకొచ్చింది. మరి ఫైమాకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

కేటీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

Leave a Reply