Rowdy Rohini: 10 గంటలపాటు జబర్దస్త్‌ రోహిణికి సర్జరీ… చివరికి ఏం జరిగింది అంటే?

జబర్దస్త్‌ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది రౌడీ రోహిణి. టీమ్‌ మెంబర్‌గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి.. తన కామెడీ టైమింగ్స్‌తో, మాట్లాడే విధానంతో అందరి ఫేవరేట్‌గా మారింది. మొట్టమొదటి లేడీ టీమ్‌ లీడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో కూడా బిజీగా మారిన రోహిణి.. ఇప్పుడు ఆస్పత్రి పాలైంది. ఆమె కాలికి సర్జరీ జరగడంతో లేవలేని స్థితిలో హాస్పిటల్‌లోనే విశ్రాంతి తీసుకుంటుంది.

తనకు సర్జరీ జరిగిన విషయాన్ని రౌడీ రోహిణీయే స్వయంగా యూట్యూబ్‌ ద్వారా వెల్లడించింది.కొన్ని సంవత్సరాల క్రితం రోహిణి కి యాక్సిడెంట్ అయినపుడు కాలుకి దెబ్బ తగిలింది, అప్పుడు ఆపరేషన్ చేసి కాలులో ఒక రాడ్ వేశారు.అయితే ఒకటి రెండు సంవత్సరాల లోపు ఆ రాడ్ ని తీసెయ్యాలి, కానీ రోహిణి ఆలా చెయ్యకుండా చాలా ఏళ్ళు ఉంచేసింది.ఆ రాడ్ ఆమె కాలులో అతుక్కుపోయింది, మళ్ళీ కాలుకు నొప్పి వచ్చింది.

అయితే ఇప్పుడు రాడ్ తీయాలంటే చాలా కష్టం అని హైదరాబాద్ డాక్టర్స్ చెప్పారని, కానీ ఎలా అయినా తీసెయ్యాలి రాడ్ అని రోహిణి విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక వారం క్రితం జాయిన్ అయింది. సుమారు 10 గంటలు శ్రమించి, సర్జరీ చేసి డాక్టర్లు రాడ్ ని తీసారని,” చెప్పింది రోహిణి తన యూట్యూబ్ ఛానల్ లో. అయితే ఆమె కనీసం ఒక ఆరు వారాలపాటు, కాలు కిందన పెట్టకూడదు, అలాగే బరువు కూడా పెట్టకూడదు అని చెప్పారు డాక్టర్లు.. ఐదేండ్ల నుంచి రాడ్‌తో అనుభవిస్తున్న నరకం నుంచి బయటపడొచ్చని ఆశపడితే ఇలా జరిగిందని వాపోయింది.

Leave a Reply