YS Jagan | నా గెలుపు మళ్ళీ చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది..

allroudadda

YS Jagan | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తొలిసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు (గురువారం) బయటకు రానున్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో ఉన్న -ఐ-ప్యాక్ సంస్థ ఆఫీస్‌ను ఆయన సందర్శించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో ఆయన ముచ్చటించనున్నారు.ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ కోసం కృషి చేసిన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పనున్నారు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళిన జగన్ అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు.ఈ సందర్భంగా…. 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని అన్నారు.ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్.

allroudadda
allroudadda

రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైస్ జగన్. అయితే మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు.

Recent Posts

Leave a Reply