YS Sharmila son | షర్మిల కుమారుడి పెళ్ళికి కూడా వెళ్లని వైఎస్ జగన్‌..

allroudadda

YS Sharmila son | ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో హిందూ సంప్రదాయల్లో శనివారం సాయంత్ర షర్మిల కుమారుడు రాజారెడ్డి-ప్రియా అట్లూరి పెళ్లి వైభవంగా జరిగింది. ఈనెల 16 నుంచి మొదలైన పెళ్లి సంబురాల్లో భాగంగా మంగళస్నానాల వేడుక(హల్దీ)ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి హల్దీ వేడుక ఫోటోలను షర్మిల సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం క్రైస్తవ సంప్రదాయంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Sharmila) హాజరుకాలేదు.కొన్ని పనుల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకానట్లు తెలిసింది. మరో పక్క కుమారుడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నూతన వధూవరులు..

allroudadda
allroudadda

పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నూతన వధూవరులు ముస్తాబవగా.. మిగిలిన వారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజా రెడ్డి, ప్రియల కుటుంబసభ్యులు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మలు రాజా రెడ్డి పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.

Leave a Reply