ఈ బాలుడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు మోస్ట్ పోలిటికల్ స్టార్,

ప్రజంట్ నడుస్తుంది ఇంటర్నెట్ యుగం. ఇప్పుడు డిజిటల్ జనరేషన్‌దే హవా. ఎప్పుటికప్పడు అప్‌డేట్ అవుతూ.. టెక్ ప్రపంచాన్ని ఏలేస్తున్నారు కుర్రాళ్లు. సోషల్ మీడియా వల్ల ఫస్సులు ఎన్ని ఉన్నాయో, మైనస్సులు కూడా అంతే ఉన్నాయ్. సినిమా వాళ్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్‌చల్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

అందులో వారిని చూసి.. ఇప్పుడు ఫలానా వ్యక్తి అంటే కొందరు అస్సలు గుర్తించలేకపోతున్నారు. ప్రజంట్ మీ ముందుకు ఓ త్రో బ్యాక్ ఫోటో పట్టుకొచ్చాం. ఈ ఫోటోలోని బాలుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో శక్తివంతమైన వ్యక్తి. అపారమైన క్రేజ్ ఉన్న పొలిటికల్ లీడర్. ఇప్పటికే చాలామంది గుర్తుపట్టి ఉంటారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి.ఈ ఫోటోలోని నూనూగు మీసాల కుర్రాడు ఇప్పుడు ఏపీని సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తున్న జగన్.

తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ఆర్ అకాల మరణం తర్వాత.. కొన్నాళ్లు కాంగ్రెస్ లో ఉండి.. 2011లో ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’తో ప్రజల్లోకి వచ్చారు జగన్. 2014లో పోటీ చేసినప్పటికీ ఆయన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో జగన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది.. రికార్డు క్రియేట్ చేశారు. తన తండ్రి అడుగుజాడల్లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు.

Leave a Reply