Child Artist | ఈ చిరంజీవి మేనకోడలు ఇప్పుడెలా ఉందో తెలుసా.. !

Child Artist

Child Artist |పరిశ్రమలోకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు. ఈక్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది.. హీరోలుగా, హీరోయిన్ లుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేసిన చిన్నారులు ఇప్పుడు గుర్తు పట్టనంతగా మారిపోతున్నారు. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాడు. జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ కు మేనకోడలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ను మీరిప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

Child Artist
Child Artist

అంతలా మారిపోయింది శ్రియా శర్మ.నువ్వు నేను ప్రేమ చిత్రంలో శ్రీ‌య‌శ‌ర్మ చైల్డ్ ఆర్టీస్ట్‌గా సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. అయితే ఆ చిత్రంలో సూర్య జ్యోతిక కూతురిగా న‌టించింది.ఆ త‌రువాత చైల్డ్ ఆర్టీస్ట్‌గా హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, ఇలా దాదాపు అన్ని భాష‌ల్లో త‌న‌కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న‌ది. టాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయినా మ‌హేష్‌బాబు సినిమా దూకుడులో కూడా స‌మంత చెల్లి పాత్ర‌లో న‌టించింది.

Child Artist | చిరంజీవి మేనకోడలు

Child Artist
Child Artist

అదేవిధంగా తెలుగు సినిమాలు అయిన ర‌చ్చ‌, తూనీగ తూనీగ‌, ఎటో వెళ్లిపోయింది వంటి సినిమాల్లో టీనేజీ అమ్మాయిగా క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకుంది.టీనేజ్ అమ్మాయి పాత్ర‌లు చేస్తున్న స‌మ‌యంలోనే హీరోయిన్‌గా చేసే అవ‌కాశం వ‌చ్చింది. అదేవిధంగా బిగ్‌బాస్‌తో ఫేమ‌స్ అయినా అలీరాజా హీరోగా తెర‌కెక్కిన గాయ‌కుడు సినిమాలో శ్రీయ‌శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది.

ముఖ్యంగా గాయ‌కుడు సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేద‌నే చెప్ప‌వ‌చ్చు.ఆ త‌రువాత హీరో శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్‌కు జోడీగా నిర్మ‌ల కాన్వెంట్ అనే చిత్రంలో కూడా న‌టించింది. ఆ చిత్రం త‌రువాత శ్రీయశ‌ర్మ త‌న దృష్టిని మోడ‌లింగ్‌పైనే పెట్టింది. సోష‌ల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే శ్రీయ ఎప్ప‌టిక‌ప్పుడూ త‌న‌కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోల‌ను అభిమానుల‌తో షేర్ చేస్తుంటుంది.

Leave a Reply