Janhvi Kapoor | ఈ చిన్న పని చేస్తే మీ ముఖం మెరిసిపోతుందన్న జాన్వీ!

allroudadda

Janhvi Kapoor | శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. పలు ప్రాజెక్ట్ లలో జాన్వీ కపూర్ పేరు వినిపిస్తున్నా ఆమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ఫైనల్ కావడం లేదనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికయ్యే ఛాన్స్ అయితే ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే జాన్వీ కపూర్ తాజాగా తన బ్యూటీ సీక్రెట్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తల్లి శ్రీదేవి అందం కోసం ఏ టిప్స్ ను ఫాలో అయిందో తాను కూడా అవే టిప్స్ ను ఫాలో అవుతున్నానని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. మా అమ్మ శ్రీదేవి ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మిగిలిన పండ్ల ముక్కలను ముఖానికి మసాజ్ లా ప్యాక్ పెట్టుకునేదని జాన్వీ కపూర్ అన్నారు. అప్పటికప్పుడు ఏ పండ్లు ఉన్నా ముఖానికి రాసుకునేదని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.

allroudadda
allroudadda

10 నిమిషాలు అలా ఉంచుకున్న తర్వాత తల్లి ముఖం కడుక్కునేదని ఆ సమయంలో అమ్మ ముఖం మెరిసిపోతూ కనిపించేదనిప్రస్తుతం నేను అదే టిప్ ను ఫాలో అవుతున్నానని జాన్వీ కపూర్ కామెంట్లు చేశారు. నా అందానికి కారణం మా అమ్మ చెప్పిన చిట్కా మాత్రమేనని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ గుడ్ లక్ జెర్రీ అనే సినిమాలో నటించగా జులై నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఆంధ్రాలో ఈ సారి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగాలి జగన్ ..! ఆళ్ల కన్నీరు

ఈ సినిమాతో జాన్వీ కపూర్ సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు జాన్వీ కపూర్ పారితోషికం పెరుగుతుండటం గమనార్హం. జాన్వీ కపూర్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు జాన్వీకి క్రేజ్ పెరుగుతోంది.

Leave a Reply