janhvi kapoor: సోషల్ మీడియాలో కాకరేపుతోన్న జాన్వీ కపూర్..!

ధ‌డ‌క్” సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది జాన్వీ కపూర్. ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే ప‌నిలో బిజీగా ఉంది. పైగా ఆఫ‌ర్లు కూడా ఈ అమ్మడికి వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. అందం విష‌యంలో త‌ల్లితో పోటీ ప‌డ‌లేక‌పోయినా.. న‌ట‌న విష‌యంలో మాత్రం క‌చ్చితంగా అతిలోక‌సుంద‌రి వార‌సురాలే అనిపించుకుంటుంది.

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందాలు ఆర‌బోసే ప‌నిలో బిజీ అయిపోయింది. యాక్టింగ్ లో ఎలాగూ ఈ భామ పర్ఫెక్ట్ కాబట్టి అభిన‌యం ప‌క్క‌న‌బెట్టి అందంపై దృష్టి పెట్టింది.తాజాగా నైకా ఫ్యాషన్ ఫొటోషూట్ కోసం హొయలు పోతూ పోజులు ఇచ్చింది. పిక్ డ్రెస్ లో అదిరిపోయింది. ప్రస్తుతం ీ రీల్ నెట్టింట సందడి చేస్తుంది.

లాస్ట్ లో జాన్వీ మెలికలు తిరుగుతూ వేసిన డ్యాన్స్ స్టెప్ కురాళ్లకు పిచ్చెక్కెలా ఉంది. మరి ఆఫర్లు రావాలంటే ఇలా హొయలు పోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. ఏదేమైనా జాన్వీ కపూర్ అభిమానులు మాత్రం ఇవ్వన్నీ చూసి తెగ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలతో కనువిందు చేస్తున్న జాన్వీ సినిమాల్లోనూ బిజీగానే ఉంది.ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్ళకత్వంలో నటిస్తోంది.

Leave a Reply