Janhvi Kapoor: తారక్ సినిమా కోసం జిమ్ లో చెమటలు చిందిస్తున్న జాన్వీ..! వీడియో వైరల్?

బాలీవుడ్ అందాల భామ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తున్న సంగతి తెలిసిందే. ఈమె అందానికి నెటిజన్లు ఫిదా అయిపోతూనే ఉంటారు. తాజాగా జాన్వి జిమ్లో వర్కౌట్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి..అందాల భామ జాన్వి కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ 30 మూవీలో ఈ భామ నటిస్తుంది.

జాన్వి ఈ సినిమాలో నటించడానికి ముందు టాలీవుడ్ ఎంట్రీ పై ఎన్నో వార్తలు వినిపించాయి. చివరికి ఎన్టీఆర్ సరసన కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాలో జాన్వి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మరింత అందంగా కనిపించడానికి తన అందాన్ని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు చెమటలు కక్కించే జాహ్నవి కపూర్ తాజాగా మరొకసారి జిమ్ లో హెవీ వర్కౌట్ చేస్తూ కనిపించారు.లేటెస్ట్ వీడియోలో జాన్వీ వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.

లేడీ ట్రెయిన్ పర్యవేక్షణలో వెయిట్ లిఫ్ట్ చేస్తూ, కఠిన వ్యాయామాలు చేస్తూ.. చెమటు కక్కిస్తూ మరింత అందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు పొట్టిగా ఉన్న జిమ్ వేర్ లో జాన్వీ వర్కౌట్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది.మేకప్ లేకుండా, స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శించింది. చూపు తిప్పుకోకుండా చేసింది. ఈ శ్రమ అంతా ఎన్టీఆర్ 30 మూవీ కోసమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఏది ఏమైనా జాన్వి వర్కౌట్ కి సోషల్ మీడియా సైతం షేక్ అవుతుందని చెప్పాలి..

Leave a Reply