Jani Master | ఆర్జీవికి పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం

allroudadda

Jani Master | ఢీ షో నుంచి వచ్చి భారతీయ సినిమాను తన డ్యాన్సులతో ఉర్రుతలూగించిన జానీ మాస్టర్ కేవలం సినిమా రణగంలోనే కాకుండా సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ ముందుంటారు. నెల్లూరు ఎప్పుడు వచ్చినా సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కాపు సామజిక వర్గ నేతలను కలుస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్లు వార్తల్లోకి రాని మాస్టర్ ఇప్పుడే ఎందుకు హాట్ టాపిక్ అయ్యారంటే ..మొన్నటి వరకు తెలంగాణా ఎన్నికల సంగ్రామం నడిచింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటూనే ఉంది. ఏ ఏ స్థానాలనుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే విషయాల పట్ల కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరు నుంచే జనసేన అభ్యర్థిగా రేసులో దిగుతున్నారని సమాచారం.తాజాగా మీడియా తో మాట్లాడిన జానీ.. నేను మళ్ళీ చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి.

allroudadda
allroudadda

రామ్ గోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జానీ మాస్టర్ కి జగన్ గారు అంటే అంత ఇష్టం.ముందు ముందు ఏం జరుగుతుందో నేను తర్వాత చెప్తాను అని వెల్లడించారు. అంగన్వాడి కార్యకర్తల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారా అని అడగగా..వాళ్ళు డిమాండ్ చేసేది వాళ్ళ హక్కు. అంత పెద్ద బాధ్యత నెత్తిన వేసుకొని ఇంటింటికి వెళ్లి పిల్లలని చూసుకోవడం అనేది పెద్ద బాధ్యత.

బిజినెస్ మ్యాన్ తో రష్మి పెళ్లి ఫిక్స్.. షాక్ లో సుధీర్..

ఒక పిల్లాడిని చూసుకోవాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. వాళ్ళు అంత కష్టపడి పని చేస్తున్నప్పుడు గుర్తించాలి. వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నారు. వాటికి సిగ్నల్ ఉండదు. అప్పటికప్పుడు ఫోటోలు పెట్టమంటారు. వీళ్ళు ట్రై చేస్తారు కానీ సిగ్నల్ దొరకదు. దానికి మీరు పని చేయట్లేదు అని ఉన్నతాధికారులు అంటారు అని జానీ మాస్టర్ వివరించారు. అయితే అంగన్వాడి కార్యకర్తల సమ్మెకు మద్దతు ఇవ్వడానికి జానీ మాస్టర్ జనసేన పార్టీ నాయకులతో కలిసి వెళ్లడం గమనార్హం.

Leave a Reply