Jaya Janaki Nayaka | సినీ చరిత్రలో బెల్లంకొండ సృష్టించిన ప్రపంచ రికార్డు ఇదే..

allroudadda

Jaya Janaki Nayaka | తెలుగులోనే ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అందుకోలేదు అప్పుడే బాలీవుడ్ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన హిందీ ఇండస్ట్రీకి వెళ్తుండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈయనకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. సోషల్ మీడియాలో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు ఈయన నటించిన సినిమాల్లో రాక్షసుడు మాత్రమే విజయం సాధించింది.

అల్లుడు శీను, జయ జానకీ నాయకా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ఇప్పటికీ తెలుగులో సేఫ్ హీరోగా గుర్తింపు రాలేదు ఈయనకు. కానీ కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయక అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా … జగపతి బాబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

allroudadda
allroudadda

ఇకపోతే 2017 వ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాబాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకు యూట్యూబ్ లో హిందీ లో ప్రసారం చేయడం మొదలు పెట్టారు.ఈ మూవీహిందీ వర్షన్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాహిందీ వర్షన్ కి యూట్యూబ్ లో 800 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇలా జయ జానకి నాయక హిందీ వెర్షన్ మూవీయూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.

Recent Posts

Leave a Reply