నన్ను చాలా మంది మోసం చేశారు.. వాళ్లకి నా శాపం తగిలింది… ఝాన్సీ కన్నీరు.

ఒకప్పుడు యాంకర్ గా .. నటిగా ఝాన్సీకి మంచి క్రేజ్ ఉండేది. తాజా ఇంటర్వ్యూలో తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుతూ .. “లక్షల్లో డబ్బులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. చెక్ పై మూడు నెలల ముందు డేట్ వేసి మోసం చేసినవారు ఉన్నారు. నాతో చాలా సన్నిహితంగా ఉంటూ, నా కాన్సెప్ట్ లు ఓకే కానివ్వకుండా చేసినవారు ఉన్నారు.

అయినా ఎందుకు ఇలా చేశారని నేను ఇంతవరకూ అడగలేదు” అని అన్నారు. “నాకు అన్యాయం చేసినవారికి నా శాపం చాలా గట్టిగా తగులుతుంది .. అది నాకు తెలుసు. నా శాపం ఎంతగా తగులుతుందనేది నాతో రెండు రోజులు కేరక్టర్ చేయించుకుని పీకేసిన వారికి తెలుసు.

ఒక పెద్ద హీరో .. పెద్ద డైరెక్టర్ .. రెండు రోజులు కేరక్టర్ చేశాను .. నా డబ్బులు నాకు ఇచ్చారు. కానీ ఆ తరువాత ఆ పాత్ర కోసం వేరే ఆర్టిస్ట్ ను తీసుకున్నారు. నిజంగా అది నాకు అవమానమే. దాంతో నా శాపము గట్టిగా తగిలింది .. మళ్లీ ఇంతవరకూ కోలుకోలేదు” అన్నారు. తాజాగా ఝాన్సీ తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

ఇప్పటి వరకూ 45 సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో ఝాన్సీ వెండితెరపై కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. తాను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ కారణంగా తనను అంతా ఫైర్ బ్రాండ్ అని పిలిచేవారు. తనను అర్ధం చేసుకున్నవారు మాత్రం తనతో పాటు కొన్నేళ్ల పాటు జర్నీ చేశారన్నారు.

నచ్చని వాళ్లు కొన్ని ఎపిసోడ్స్‌తోనే తనకు ఫుల్ స్టాప్ పెట్టారన్నారు. ఓ డ్యాన్స్ షఓకి 99 ఎపిసోడ్స్‌కి తాను యాంకరింగ్ చేశానని.. 100వ ఎపిసోడ్‌కి మాత్రం తనతో కాకుండా వేరొకరితో చేయించారన్నారు. కారణం ఎందుకని తాను అడగలేదని.. వారు కూడా చెప్పలేదన్నారు. తనను చాలా మంది మోసం చేశారని.. వారందరినీ గుర్తు పెట్టుకుని కక్ష సాధించే ఉద్దేశం తనకు లేదని ఝాన్సీ తెలిపారు.

Leave a Reply