వామ్మో.. సుజాతని రాకేష్ కట్నం విషయంలో ఎంత మాట ఆందో చూడండి..!

జోర్దార్ వార్తల ద్వారా తెలంగాణ యాసలో గడగడ మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సుజాత ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా మారిపోయారు. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో ఈమె రాకింగ్ రాకేష్ టీమ్ లో సందడి చేసేవారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎక్కువగా రాకేష్ స్కిట్ లో చేస్తూ ఆయనతో ప్రేమలో పడిన సుజాత వీరి ప్రేమ విషయాన్ని జబర్దస్త్ వేదికపైనే ప్రకటించారు.ఇటీవల సుజాత ఓ ఇంటర్వ్యూలో మాట్లడుతూ వాళ్ల పెళ్లి గురించి ఓ మాట చెప్పింది. టీం లీడర్ స్థాయికి రావడం సులభం కాదు అని.. ఆ స్థాయికి చేరుకోవడం ఎంతో కష్టపడితే తప్ప సాధ్యం అవ్వదు అని సుజాత స్పష్టం చేశారు.

ఇకపోతే రాకేష్ ఒంటరి పోరాటం చేసేవాడు.. కాబట్టి ఆ కష్టం ఇంకొంచెం ఎక్కువే ఉంటుందని.. పెళ్లయిన తర్వాత కూడా రాకేష్ టీం లో కొనసాగుతున్నాను అంటూ ఆమె తెలిపారు.. అలాగే కట్నం విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. రాకేష్ కట్నం విషయం గురించి మా అమ్మ నాన్నలు అడిగినప్పుడు మీ పిల్లని ఇస్తే చాలు మీ ఆస్తులు నాకు అక్కర్లేదు అంటూ చెప్పేశాడు.

ఇక ఆ విషయం నన్ను మరొకసారి ఆయనపై ప్రేమను పెంచేసింది..రాకేష్ కు కట్నం ఏమీ ఇవ్వలేదు అంటూ సుజాత తెలిపారు. ఇకపోతే తన టీమ్లో చేస్తున్నందుకు రాకేష్ తనకు రెమ్యూనరేషన్ ఇస్తాడు అని ఆ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అని సుజాత తెలిపింది. తాము మొదట స్నేహితులుగా ఉండే వాళ్ళమని ఆ తర్వాత ప్రేమికులుగా మారామని.. ఆ సమయంలో తనకు రాకేష్ చాలా బహుమతులు ఇచ్చారంటూ ఆమె తెలిపారు.

Leave a Reply