Jr Ntr: ఎన్టీఆర్ తాత ఊరిలో జూ.ఎన్టీఆర్ వందల కోట్ల ఆస్తులు..!

Ntr: తారక రామారావు గారి మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హరికృష్ణ చిన్న కుమారుడు ఎన్టీఆర్ అన్న సంగతి తెలిసిందే. అయితే మొదట్లో ఎన్టీఆర్ ను నందమూరి ఫ్యామిలీ చేరదీయలేదు అనే టాక్ ఉంది. చాలాసార్లు దాన్ని నిజం చేస్తూ ఎన్టీఆర్, బాలకృష్ణ తమ ప్రవర్తనలతో పరోక్షంగా బయట పెడుతూనే ఉంటారు.

Jr.NTR

అయితే తారక్ రామ్ గా ఉన్న చిన్న రామయ్యకి ‘ఎన్టీఆర్’ అనే మూడు అక్షరాలను బహుకరించింది ఆయన తాత సీనియర్ ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ కు ఎంత అభిమానమో ఇటీవల కొడాలి నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘ఎన్.టి.రామారావు గారు తన వారసులందరికీ సమానంగా ఆస్తులు పంచారు.ఆయన సొంత ఊరు అయిన నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా 5 ఎకరాల పొలం రాసిచ్చారు.ఇప్పటికీ ఆ పొలం అలాగే ఉంది.’

అంటూ కొడాలి నాని తెలిపాడు. ఇప్పుడు ఆ పొలం ఖరీదు రూ.7.5 కోట్ల నుండి రూ.10 కోట్లు విలువ చేస్తుందని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఈ పొలాన్ని పట్టించుకోవడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.60 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు.తారక్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్నారు.

Leave a Reply