Devara NTR | ‘దేవర’ మూవీ నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..కెవ్వు కేక అంతే..

allroudadda

Devara NTR | కొరటాల శివ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న దేవర మూవీ నుంచి ఆ మద్య వచ్చిన మొదటి ప్రచార వీడియో మామూలుగా లేదు. ఒకటింపావు నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఈ వీడియోని బట్టి చూస్తే ఇది సముద్రం, సముద్రదొంగల నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. కొందరు దొంగలు సముద్రంలో ఒక ఓడపైకి వెళ్లి సరకు దోచుకురావడాన్ని ఈ వీడియోలో చూపించారు.

అలాగే సముద్రం ఒడ్డున జరిగిన ఫైటింగ్ సీన్ లో ఎన్టీఆర్ తన శత్రువుల్ని చీల్చి చెండాడుతున్న సీన్ భయం గొలిపేదిగా ఉంది. చివర్లో ఎన్టీఆర్ ‘ఈ సముద్రం సేపల కంటే కత్తుల్నీ, నెత్తుర్నీ ఎక్కువ చూసుంటాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ పలికిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సముద్రం ఒడ్డున లుంగీ ధరించి ఉన్న ఎన్టీఆర్ ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఈ వీడియోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

allroudadda
allroudadda

కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పుడు లీకైన వీడియోలో ఉన్నదీ ఫాదర్ క్యారెక్టర్ అని తెలుస్తుంది.లుంగీ ధరించి ఉన్న పాత్ర తండ్రిదని, ప్యాంటు ధరించి ఉన్న పాత్ర కొడుకుదని సమాచారం. కాగా అభిమానులంతా ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. సినిమాని ఏప్రిల్ నుంచి పోస్టుపోన్ అయితే చేసారు గాని, కొత్త రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. దసరా టైములో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

Leave a Reply