అమ్మా, నాన్న క్షమించండి’ తారక్ ఆభిమాని చివరి సెల్ఫీ వీడియో..!

ఎన్టీఆర్ అంటే ప్రాణమిచ్చే అభిమానులున్న సంగతి తెలిసిందే. తన నటనతో .. డాన్స్ లతో కోట్లాదిమందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు తారక్. అంతే కాదు ఆయన ఏది చేసినా..అది అభిమానుల కోసమే.. తారక్ ఫ్యాన్స్ ను అమితంగా ఇష్టపడుతాడు. ఎప్పుడు అభిమానుల బాగోగులు కోరుకుంటూ ఉంటాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరైన సమయంలో తారక్ అభిమానులను ఉద్దేశించి చెప్పే ఎమోషనల్ వర్డ్స్ ప్రతిఒక్కరిని కదిలిస్తాయి.

ఇక తారక్ అభిమాని ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణించడం తో ఎన్టీఆర్ అభిమానుల్లో విషాదం నిండిపోయారు. ఇక శ్యామ్ మరణం పై అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు చెప్తుండటంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.ఈ నేపద్యంలో అభిమాని మృతిపై జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.

ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశారు. ‘శ్యామ్‌ మరణం అత్యంత బాధాకరమైన ఘటన. అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది. ప్రభుత్వ అధికారులు తక్షణమే దర్యాప్తు జరపాలి” అని ఎన్టీఆర్‌ విజ్ఞప్తి చేశారు.మరో పక్క చనిపోయే ముందు శ్యామ్ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది.

ఆ వీడియోలో “అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను లేకపోయినా మీరు ఆనందంగా ఉండండి. నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు అమ్మానాన్న థాంక్స్. నేను అందరి దృష్టిలో వేస్ట్.. నేను ఉన్నా కూడా మీకు లాభం లేదు. ఐ లవ్ యూ ఫరెవర్, మళ్లీ జన్మంటూ ఉంటే మీకే పుట్టాలి. నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. నేను జాబ్ చేయలేను.అందుకే నిర్ణయం తీసుకున్నా. మిస్ యూ మమ్మీ డాడీ. సాయి శ్రీనన్న, మిస్ యూ అన్నా- లవ్ యూ అన్నా. మళ్లీ జన్మంటూ ఉంటే నీకు శిష్యుడిగా పుట్టాలి” అంటూ శ్యామ్ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

Leave a Reply