ఎన్టీఆర్ ధ‌రించిన ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది!

స్టార్ సెలబ్రిటీస్ ధరించే కాస్ట్యూమ్స్ మొదలుకుని వాచ్ ల వరకు అన్నింటి విషయంలో కూడా సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు ధరించే వాచ్ ల గురించి ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. వారి వాచ్ ల ధర లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరింది.ఆ మధ్య ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర వైరల్ అయిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ ఇటీవల ధరించిన వాచ్ ఏకంగా రూ.2.5 కోట్లుగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.పటెక్ ఫిలిప్ వాచ్ తో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. ఈ వాచ్ గురించి అభిమానులు ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన సమయంలో ఏకంగా రెండున్నర కోట్లుగా ధర చూసి షాక్ అవుతున్నారు.వంద కోట్ల హీరో వాచ్ ధర ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుందనే అభిప్రాయంను కొందరు అభిమానులు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వాచ్ కు మరీ ఇంత ధర ఎందుకు భయ్యా అంటున్నారు.

ఎన్టీఆర్ స్థాయికి ఈ వాచ్.. ధర చాలా కామన్ విషయం అంటున్నారు.యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఎన్టీఆర్ 30(NTR 30) వ‌ర్కింగ్ టైటిల్ తో కొద్ది రోజుల క్రిత‌మే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో శ‌ర‌వ‌గేంగా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే..రీసెంట్ గా ఎన్టీఆర్ త‌న నివాసంలో ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడు.

Leave a Reply