విశ్వ‌నాథ్ ఖాకీ దుస్తులు ధ‌రిచ‌డం వెన‌క ఉన్న అస‌లు కార‌ణం ఏంటంటే..?

నిజానికి సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల వేషధారణ ప్రత్యేకంగా ఉంటుంది. పరుచూరి గోపాలకృష్ణ ఎర్ర శాలువా, కోడి రామకృష్ణ నుదిటిపై రిబ్బన్ ఇలా చాలా మంది ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా పరమపదించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ విషయంలోనూ ఓ ప్రత్యేకత వుంది. అదేంటో తెలుసా.. కళాతపశ్వి కే విశ్వనాథ్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి తెలిసిందే.

ఈయన మరణ వార్త తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి.తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారు నేడు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇక గతంలో ఈయన దర్శకత్వం వహిస్తున్న సినిమాకు సంబంధించిన స్టిల్స్ కనుక చూస్తే ఈయన ప్రతిచోట కూడా ఖాకీ చొక్కా ధరించి కనిపిస్తారు.

ఇలా ఈయన ఖాకీ చొక్కా ధరించి షూటింగ్ లొకేషన్లో పాల్గొనడానికి గల కారణం ఏంటి అని ఓ సందర్భంలో విశ్వనాథ్ గారిని ప్రశ్నించడంతో ఆయన సమాధానం చెబుతూదర్శకత్వం అనేది ఓ బాధ్యత.ఓ విధి.ఓ ఉద్యోగం లాంటిది అందుకే దాన్ని విధిగా ఆచరించాలనే ఉద్దేశంతోనే అలా యూనిఫామ్ లో కనిపిస్తానని తెలిపారు.ఇలా ఈయన సినిమాల పట్ల ఇంత డెడికేషన్ చూపిస్తారు కనుక ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయని చెప్పాలి.

Leave a Reply