Kajal Aggarwal | వామ్మో.. మేకప్ లేకుండా కాజల్ ఇంత దారుణంగా ఉంటుందా..?

Kajal Aggarwal | కాజల్ అగర్వాల్.. ఈ చంద‌మామ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినీ కెరీర్ స్టాట్ చేసి 12 ఏళ్లు అవుతున్నా.. ఆమె జోరు మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. పాత్ర ఎలాంటిదైనా దానికి పూర్తిగా న్యాయం చేయడంలో కాజల్ ముందుంటుంది. చందమామ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూనే ఉంది.

ఈ క్ర‌మంలోనే సౌత్ ఇండియన్ తెరపై సూపర్ క్రేజ్ సంపాదించింది కాజల్ అగర్వాల్. ఇక తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత సెటిల్ అయిన‌ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలతో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది.ఇక కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది.ఆ మధ్య లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లో ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.

అలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ మ‌తిపోగొట్టేస్తుంది.అయితే సినిమా అనే రంగుల ప్రపంచంలో నటి నటిమణులు ముఖానికి రంగు, మనసుకు ముసుగు వేసుకొని నలుగురికి వినోదం పంచుతారు. రంగుల ప్రపంచంలో నటిమణులు ముఖానికి మేకప్ లేకుండా కెమెరా ముందుకు రావడం కష్టమే. అలాంటిది తన అందం, అభినయంతో అగ్ర కథానాయికగా రాణిస్తున్న హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ మేకప్ లేకుండా దిగిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచెయ్యండి,

Leave a Reply