కళ్ళు చిదంబరం కళ్ళు అలా అవడాని కారణం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప కమెడియన్ కళ్ళు చిదంబరం తన నటనతో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించే మవప్పించారు కళ్ళు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా సినిమాలు చేశారు. ముందుగా నాటకాలు వేసేవారు మొదట్లో కళ్ళు బాగానే ఉండేవి కానీ కొన్ని అనారోగ్య కారణాల రీత్యా అవి మధ్యలో అలా అయ్యాయట అయితే ఈ కళ్ల వల్లే ఆయనకు సినిమా అవకాశాలు చాలా పెద్దగా వచ్చాయని చెబుతారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన ఒక గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు మొదట్లో నాటకాలు వేసే వారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి రావడం జరిగింది.ఈయన కళ్ళు ఆ విధంగా అయిపోవడానికి కారణం నాటకాలు వేసే రోజుల్లో తిండి నిద్ర సరిగ్గా ఉండేవి కాదట అలాంటి సందర్భాల్లో కంటిపై ఒత్తిడి విపరీతంగా పడేదట తద్వారా కంటి దగ్గర ఉండే నరాలు పక్కకు వెళ్లిపోవడంతో ఆయనకు మెల్లకన్ను రావడం జరిగిందట.

వాటిని ఆపరేషన్ చేయించి మళ్లీ మునుపటిలా చేయించుకుందామని అనుకునే సందర్భంలో ఈ కళ్ళ మీదే సినిమాలు తీసేందుకు ఆఫర్లు వచ్చేయట ఇలా ఉంటేనే ఎక్కువ పాత్రలు వస్తున్నాయని ఆయన ఆపరేషన్ విషయంలో వెనక్కి తగ్గారట దీనికి సంబంధించి కళ్ళు చిదంబరం కొడుకు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.కేవలం నటన మీద సినిమాల మీద పిచ్చితో ఈయన తన కళ్ళను అశ్రద్ధ చేశారని చెప్పవచ్చు.

కళ్ళు చిదంబరం కేవలం సినిమాలు నటించడమే కాదు విశాఖ పోర్టు ట్రస్ట్ లో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేసేవారు అలాగే ఆ రోజుల్లో వరుసపెట్టి సినిమాలు చేసి డబ్బు కూడా బాగానే సంపాదించారట. ఈయన 1945 అక్టోబర్ 10న విశాఖపట్నంలో జన్మించారు 2015 అక్టోబర్ 19న అనారోగ్య కారణాల చేత విశాఖపట్నం లోని హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఈయన తన చిన్నతనంలో 12 ఏళ్ల వయసు నుంచే నాటకాలు వేసే వారట ఈయన తన జీవితంలో చాలా దానధర్మాలు చేశారని తెలుస్తోంది.

Leave a Reply