Karate Kalyani: నన్ను చంపేందుకు చాలా మండి ట్రై చేస్తున్నారు.. కరాటే కల్యాణి కామెంట్స్‌..!

కరాటే కల్యాణిపై మా అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఖమ్మంలో ఏర్పాటు చేయాలనుకున్న దివంగత ఎన్టీఆర్ విగ్రహంపై కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్నిరద్దు చేసింది. మే 16న ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై స్పందించక పోవడంతో ఆమెను మా అసోసియేషన్ నుండి సస్పెండ్ చేసినట్లు జనరల్ సెక్రటరీ రఘుబాబు తెలిపారు.

మా అసోసి‍యేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. అయితే కరాటే కల్యాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్యాణి తనకు ప్రాణ హాని ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని,

ఆ విషయాన్ని గమనించకండా అదే కారులో ప్రయాణించినట్లు తెలిపింది. ఆపై కొంత దూరం వెళ్లిన తర్వాత కారు టైర్లు పేలిపోయి స్వల్ప ప్రమాదంతో భయటపడినట్లు తెలిపింది. అదే హైవే మీద ప్రయాణించి ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేది అని వాపోయింది.అనంతరం మెకానిక్‌ వద్దకు వెళ్తే.. ఎవరో కావాలనే కారు టైర్లను కోసేశారని తేలడంతో ఖంగుతిన్నట్లు తెలిపింది.

Leave a Reply