Adipurush: ప్రభాస్ అసలు రాముడిలా కనిపించడం లేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన సీరియల్ నటి.

ఆదిపురుష్’ మూవీకి ప్రస్తుతం కొనసాగుతున్న మ్యానియాను చూసి డార్లింగ్ అభిమానులు మంచి జోష్ లోకి వెళ్ళిపోతున్నారు. ‘బాహుబలి 2’ తరువాత సరైన హిట్ లేక సతమతమైపోతున్న ప్రభాస్ కు ఈమూవీ ఒక ట్రెండ్ సెటర్ గా మారుతుందని అభిమానుల అంచనా. దీనికితోడు ఈమూవీని సపోర్ట్ చేస్తూ రణబీర్ కపూర్ రామ్ చరణ్ లాంటి సెలెబ్రెటీలు ఈసినిమాకు సంబంధించిన..

టిక్కెట్లు వేల సంఖ్యలో కొని చారిటీగా పేదలకు చిన్న పిల్లలకు వృద్ధులకు ఇస్తున్న విషయానికి సంబంధించిన వార్తలు ప్రభాస్ అభిమానులకు మరింత జోష్ ను పెంచుతున్నాయి.ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పోస్టర్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు కొందరు సినిమాపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.ముఖ్యంగా ప్రభాస్ రాముడిలా అసలు కనిపించడం లేదంటూ ఈయన గెటప్ పై చాలా విమర్శలు వచ్చాయి.

ముఖ్యంగా రాముడు లక్ష్మణులకు మీసాలు గడ్డాలు ఉండడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.ఈ విధంగా ప్రభాస్ లుక్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో తాజాగా నటి కస్తూరి శంకర్ Kasturi సైతం ఈ సినిమాలోని రాముడి పాత్ర పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.రామలక్ష్మణులను మీసాలు గడ్డాలతో చూపించడం ఏంటి ఇలాంటి సాంప్రదాయం ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి కలవర పెట్టే పాత్రలను ఎందుకు సృష్టించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండ్స్ శ్రీరాముడి పాత్రలో నటించారు. వారందరిని తెరపై చూస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని చూసిన భావన కలుగుతుంది కానీ ప్రభాస్ ని చూస్తుంటే మాత్రం శ్రీరాముడిలా లేరని ఆయన కర్ణుడిలా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా కస్తూరి శంకర్ Kasturi చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Leave a Reply