Viral Video | నువ్వు కావాలయ్యా సాంగ్ కి మాస్ స్టెప్పులేసిన ఏనుగు..

allroudadda

Viral Video | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా..బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే.. ఈ చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా ‘నువ్వు కావాలయ్యా’ అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్‌లో తమన్న స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరూ.

దీంతో ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. అంతే కాకుండా.. సెలబ్రెటీలు సైతం ఈ సాంగ్‌కు స్టెప్పులు వేసి వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఇదే పాటకు ఏనుగు కూడా స్టెప్పులు వేసి అదరహో అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఆశ్చర్చపోతున్నారు.

allroudadda
allroudadda

వీడియోలో ఉన్నదాని ప్రకారం.. ‘‘నువ్వు కావాలయ్యా’ అనే సాంగ్‌కు ఏనుగు సేమ్ టూ సేమ్ తమన్నా వేసిన స్టెప్పులే వేసింది’. అయితే.. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది నిజమైన ఏనుగు కాదని తెలుస్తోంది. ఏనుగు బొమ్మని ధరించిన ఇద్దరు వ్యక్తులు అలా డాన్స్ వేశారు. అయితే ఆ బొమ్మ ఏనుగు చూడడానికి నిజమైన ఏనుగులాగే ఉంది. అంతలా బొమ్మని రెడీ చేశారు. అంతేకాదు, లోపల ఉండి డాన్స్ వేసిన వ్యక్తులు కూడా ఏనుగుకి తగ్గట్లు డాన్స్ వేసి వావ్ అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టిం చక్కర్లు కొడుతోంది.

Leave a Reply